షేక్ హసీనాను అప్పగించండి..! 4 h ago
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరింది. దీని కోసం భారత్ ను దౌత్య మార్గంలో సంప్రదించినట్లు తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. న్యాయ ప్రక్రియలో భాగంగా విచారించేందుకు ఆమెను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుకుంటుందని ఈ విషయంపై భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశామని విదేశీ వ్యవహారాల సలహాదారుడు తౌహీద్ హుస్సేన్ వెల్లడించారు. బంగ్లా హోంశాఖ కూడా హసీనాను రప్పించేందుకు పలు చర్యలు చేపట్టింది.